BREAKING
అమరవీరుల వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం

Select Suryaa Now
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం

పూసపాటిరేగ, సూర్య : పూసపాటిరేగ జడ్పిటిసిగా పోటీ చేసిన తనను కుట్రలు చేసి పోటీ నుంచి విరమింప చేసే విధంగా కూటమి నాయకులు కుట్రలు పన్నారని, అదే కోటం నాయకులు జడ్పీటీసీగా తప్పుడు  ధ్రుపత్రాల ద్వారా పోటీ చేస్తున్నారని ఇదే కూటమి ప్రభుత్వ నిరంకు సత్తువపాలన కు నిదర్శనమని వైకాపా నాయకుడు బొత్స చైతన్య అన్నారు. మండల జడ్పిటిసి గా వైకాపా తరఫున పోటీ చేస్తున్న మహంతి శివ, ఎంపీపీ అభ్యర్థి పతివాడ అప్పలనాయుడు లకు మద్దతుగా చైతన్య ప్రచారాన్ని పతివాడ, చౌడువాడ ఎంపీటీసీ సెగ్మెంట్లలో ప్రచారాన్ని శనివారం హోరెత్తించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ పూసపాటి రాగ మండలానికి జడ్పిటిసిగా తాను పోటీ చేస్తే అవతల పక్షానికి భయం పట్టుకుందని, తనపై కొన్ని సాంకేతిక కారణాలను చూపి జడ్పిటిసి పోటీ చేయకుండా కూటమి నాయకులు అడ్డుకున్నారని, అదే కూటమిలో ఉన్న నాయకులు జడ్పిటిసి గా పోటీ చేస్తున్నవారు తప్పుడు పత్రాలు సమర్పించలేదా అని చైతన్య ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జడ్పిటిసిగా పోటీ చేసేందుకు అవకాశం రాకపోయినా దానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజాసేవ తన లక్ష్యమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైకాపా నాయకులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ప్రచార సభలో చైతన్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల పోరులో జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహంతి శివతో పాటు, వైకాపా తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ సభ్యులందరినీ గెలిపించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందించాల్సిన అవసరం అందరిపై ఉందని  చైతన్య స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో చౌడువాడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామస్వామి, జడ్పిటిసి అభ్యర్థి మహంతి శివ, ఎంపీపీ అభ్యర్థి పతివాడ అప్పలనాయుడు,  నాగబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.