BREAKING
అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌కు తెరపడినట్టేనా: భారత స్టార్ ఆల్ రౌండర్ భవితవ్యంపై చతేశ్వర్ పుజారా సంచలన వ్యాఖ్యలు రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు

Select Suryaa Now
వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు

రాజాం, సూర్య : స్థానిక ఎన్నికల వేళ రాజాం నియోజక వర్గంలో వైసీపీలో కలవరం మొదలయ్యింది.గ్రామస్థాయిలో పట్టున్న నాయకులు,క్రియాశీలక కార్యకర్తలు ఒక్కొక్కరుగా వైకాపాను వీడుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంప్ కార్యాలయంలో రాజాం మండలం గడ్డిముడిదాం పంచాయతీ,పీఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,రేగిడి మండలం లచ్చరాయపురం (కుమ్మరి అగ్రహారం)కు చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ స్థానిక ఎన్నికల విజయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.కూటమి పాలనలో పల్లెలకు మహర్దశ పట్టిందని,ప్రగతి బాటలో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయని అయన  అన్నారు.రాజాం నియోజకవర్గంలో రెండేళ్లలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మార్చమన్నారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. సీసీ,బీటీ రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచి,పల్లెల్లో అభివృద్ధికి కృషిచేసినట్లు పేర్కొన్నారు.