BREAKING
పేదరిక రహిత దిశగా భారత్ నేడే (ఆదివారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి -- దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం –నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన -- ఏవో బ్రహ్మ రెడ్డి బాలలు పనిలో కాదు.. బడిలో ఉండాలి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియో వైద్యులు కరుణాకర్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ మండల స్థాయిలో జంపని విద్యార్థులు ప్రథమ స్థానం ఇందిరాగాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.… సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, షేక్ హాజీ గౌస్ రాప్తాడు ఘటనపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా సంక్షేమం జగన్ తోనే సాధ్యం -- వరికూటి అశోక్ బాబు గీతం లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీ ప్రారంభం భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి.... * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం *

రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

Select Suryaa Now
రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి అని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి అనంతపురము జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు స్పెషలిస్ట్ డాక్టర్లతో మెరుగైన వైద్యం అందిస్తుండగా, శనివారం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని, వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పరామర్శించారు. ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తరలించాల్సిన మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అమ్మాయి ఆరోగ్యంపై ఆరా తీస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. దాడి చేసిన నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లేశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.