BREAKING
అమరవీరుల వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత

ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు...

Select Suryaa Now
ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు...

విజయనగరం, సూర్య : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక రాజీవ్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, స్థానిక ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు తేజ్ భరత్, ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం సందర్శించారు. కౌంటర్లను, పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది వసతులు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూముల భద్రత, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయని, మొత్తం 322 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అబ్జర్వర్ సమక్షంలో సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి రవాణా కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద మొత్తం 82 వాహనాలను సిద్ధం చేశామన్నారు.


ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులు, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించే సిబ్బందికి రెండు విడతలుగా ఇప్పటికే సమగ్ర శిక్షణ అందించినట్లు వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని, విజయనగరం రాజీవ్ స్టేడియం తో బాటు, నెల్లిమర్లలో స్థానిక కళాశాలలో, బొబ్బిలిలో  కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్, లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశామని, మూడు ప్రాంతాల నుంచి నిరంతరం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేలా క్లోజ్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఓటర్లందరికీ ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.