బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ .
బద్వేల్ మేజర్ న్యూస్.. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రేపు జరగనున్న ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా జర్నలిస్టులకు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ పాసులు మంజూరు చేశారు. అక్రిడేషన్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రదేశాలలో ఎలక్షన్ పాసులు పొందిన జర్నలిస్టుల తప్ప ఇతరులకు అనుమతించమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పోలింగ్ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారని ప్రతి ఓటర్ స్వచ్ఛందంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఓటర్లను కోరారు.
రిపోర్టర్: రవికుమార్, బద్వేల్, కడప జిల్లా