BREAKING
అమరవీరుల వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత

అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత

Select Suryaa Now
అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత

విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీమతి ఎ.పద్మలత  అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆమె జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  ని మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేయగా, జిల్లా ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనపరమైన వ్యవహారాలను చూడాలన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చురుకైన బాధ్యలు నిర్వహించాలని అదనపు ఎస్పీ శ్రీమతి పద్మలత  సూచించారు. ఎ.పద్మలత  1998 సం.లో డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీసుశాఖలో ప్రవేశించి, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, 2010 సం.లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు గాను, 2020 సం.లో డీఎస్పీ గాను, 2026 సం.లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. గతంలో ఆమె రాయసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలలో వివిధ హోదాల్లో, వివిధ పోలీసు స్టేషన్లులో పనిచేసి, ప్రజలు, అధికారుల మన్ననలు పొంది, సమర్థవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు.