BREAKING
అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌కు తెరపడినట్టేనా: భారత స్టార్ ఆల్ రౌండర్ భవితవ్యంపై చతేశ్వర్ పుజారా సంచలన వ్యాఖ్యలు రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

పురపోరుకు అంతా రెడీ...

Select Suryaa Now
పురపోరుకు అంతా రెడీ...

విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 7 గంటలు నుంచే బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ ప్రారంభం కానున్నది. ​

మున్సిపాలిటీల వారీగా ఓటర్లు మరియు వార్డుల వివరాలు:-

​విజయనగరం కార్పొరేషన్ :
​సెప్టెంబర్ 3, 2026 నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,050 (పురుషులు: 1,08,010; మహిళలు: 1,15,015; ఇతరులు: 25).  ​పునర్విభజన  తర్వాత మొత్తం 62 వార్డులు ఉన్నాయి.  ​తుది జాబితా ప్రకారం మొత్తం 229 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ​ఎన్నికల కోసం 510 బ్యాలెట్ బాక్సులు అందాయి. ​16 మంది ఆర్‌ఓలు , 16 మంది ఏఆర్‌ఓలు  (రిజర్వ్‌తో కలిపి 2+2)లను కేటాయించారు.  ​14 రూట్లు, 14 జోన్లుగా విభజించి అధికారులను నియమించారు. పోలింగ్ సిబ్బంది కింద ప్రిసైడింగ్ అధికారులు  275, ఇతర సిబ్బంది 1,375 (మొత్తం 1,650) కేటాయించారు. 

​బొబ్బిలి మున్సిపాలిటీ :

​మొత్తం ఓటర్ల సంఖ్య 49,284 (పురుషులు: 23,868; మహిళలు: 25,411; ఇతరులు: 5).  ​మొత్తం 36 వార్డులు మరియు 69 పోలింగ్ కేంద్రాలు. ​దీనికి 150 బ్యాలెట్ బాక్సులు, 9 మంది ఈఓలు , 9 మంది ఏఈఓలు (రిజర్వ్ 3+3) నియమితులయ్యారు.  ​6 రూట్లు, 6 జోన్లుగా విభజించగా, పోలింగ్ సిబ్బంది మొత్తం 497 మంది పివోసు: 83, ఇతరులు: 414) కేటాయించారు.
 ​నెల్లిమర్ల నగర పంచాయతీ : ​మొత్తం ఓటర్ల సంఖ్య 19,075 (పురుషులు: 9,257; మహిళలు: 9,817; ఇతరులు: 1).  ​పునర్విభజన తర్వాత 23 వార్డులు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  ​దీనికి 60 బ్యాలెట్ బాక్సులు కేటాయించబడ్డాయి. ఎన్నికల నిర్వహణకు 6 గురు ఈఓలు, 12 మంది ఏఈఓలు (రిజర్వ్ 2+2) బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  ​6 రూట్లు, 6 జోన్లుగా గుర్తించగా, మొత్తం 168 మంది పోలింగ్ సిబ్బందిని (POs: 29, ఇతరులు: 139) కేటాయించారు.  మూడు మున్సిపాలిటీల ​అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నారు.