విద్యార్థులకు హేట్రో డ్రగ్స్ సహకారం అభినందనీయం
విద్యార్థులకు హేట్రో డ్రగ్స్ సహకారం అభినందనీయం
మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
జిన్నారం ; :విద్యార్థుల విద్యాభివృద్ధికి హేట్రో డ్రగ్స్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం ఉన్నత పాఠశాలలో హేట్రో డ్రగ్స్ సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, షూస్, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు సంస్థ అండగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హేట్రో హెచ్‌ఆర్ భాస్కర్, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, పూడూరు సుధాకర్, ఏర్పుల వీరేశం, నాగారం యాదగిరి, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.