BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్..

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్  ఆర్. మహేష్ కుమార్..

                                               సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి…
అమలాపురం, మేజర్ న్యూస్ :త్వరలో జరగనున్న  స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలని, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం అమలాపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా జాయింట్ కలెక్టర్‌ నైదియా దేవితో కలిసి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రజా పరిషత్తు, పంచాయతీ ఇతర అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలివడనున్న నేపథ్యంలో జిల్లాలో పురపాలక, ఎంపీటీసీ, జడ్పీటీసీ , సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలన్నారు. ప్రాముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి.ఆర్డీవోలు, డీఎస్పీలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్టేషనరీతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రిజర్వ్‌ తో కలిపి అవసరమైన బ్యాలెట్ బాక్సుల సంఖ్యను ముందుగానే నిర్ధారించుకుని ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల విధులకు అవసరమైన మానవ వనరుల అంచనాను ముందుగానే సిద్ధం చేసి, మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి తన బాధ్యతలు, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వచ్చే న్యాయపరమైన అంశాలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో నిబంధనల మేరకు ప్రత్యేక లీగల్ టీమ్, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల నియమావళికి లోబడి అన్ని మున్సిపాలిటీలు, మండలాల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ ద్వారా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సున్నిత, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు