BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

ఇంద్రకీలాద్రి,  మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌తో కలిసి ఘాట్ రోడ్డు, కొండచరియలు పడిన ప్రాంతాల్లో చేపట్టిన రక్షణ చర్యలు, నూతన పూజా మండపం, కొత్త లడ్డూ పోటు భవనం, ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు మల్లేశ్వరస్వామి ఆలయ నిష్క్రమణ మెట్ల మార్గాన్ని పరిశీలించారు. దసరా సమయంలో భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నిష్క్రమణ మార్గంలో రద్దీ, తోపులాటలు లేకుండా బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున నిర్మాణ, మరమ్మతు పనులను ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.