BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Select Suryaa Now
పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం..  సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

విజయవాడ సెంట్రల్,  మేజర్ న్యూస్ : పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పేద కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 26వ డివిజన్ చుట్టుకుంటలో ముస్లిం సమైక్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వితంతువులు, పేద మహిళలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా సరుకులు అందజేశారు. సమాజ సేవలో భాగంగా పేదలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ విభాగ అధ్యక్షుడు షేక్ గౌస్ భాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మన డివిజన్–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సుమారు 30 మంది వితంతువులు, పేద మహిళలను గుర్తించి వారికి సహాయం అందించడం అభినందనీయమన్నారు. పేదలు, బలహీన వర్గాలు, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పీ4 పథకం ద్వారా పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని బొండా ఉమా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ సర్తాజ్ అహ్మద్, జాయింట్ ట్రెజరర్ ఇబ్రహీం, మహిళా కార్యదర్శి నసీమ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.