BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ..

Select Suryaa Now
నో యువర్ లీడర్’  సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ..

అమలాపురం మేజర్ న్యూస్ భారతదేశ నాయకత్వ నిర్మాణంలో యువత ప్రతిభను ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయిలో కొనసాగుతారని  జిల్లా కలెక్టర్ డా.మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు నో యువర్ లీడర్ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమనస జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఉండ్రాజవరపు భవ్య శ్రీ జిల్లా కలెక్టర్ సాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత పార్లమెంట్ లోక్‌సభ సచివాలయానికి చెందిన పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్  ఆధ్వర్యంలో అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో గల సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో జాతీయ నాయకుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్  విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు జాతీయ స్థాయిలో మరింత ఉన్నతంగా రాణించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. భవ్య శ్రీ సాధించిన ఈ అవకాశం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు.పార్లమెంట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని భవ్య శ్రీని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు