BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం

Select Suryaa Now
17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం

కృష్ణలంక, మేజర్ న్యూస్ : విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ రాణిగారితోట సెంటర్‌లో నిర్వహించిన ఫ్లాష్ మాబ్స్ కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. యువత ఉత్సాహభరిత నృత్య ప్రదర్శనలతో నాలుగు రోడ్ల కూడలి సందడిగా మారగా, కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువత నృత్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉత్సాహంగా అభినందించారు. ఫ్లాష్ మాబ్స్ ద్వారా విజయవాడ ఉత్సవ్ 2.0 విశేషాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కొప్పొలు శ్రీనివాస్ చౌదరి, టీడీపీ 18వ డివిజన్ అధ్యక్షుడు కొక్కెర తిరుపతయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.