ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్..
అమలాపురం మేజర్ న్యూస్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియ దేవీ, డీఆర్వో వి.సుబ్బారావు, ఎస్డీసీ డి.అచ్చుతాకుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్, సమగ్ర శిక్ష ఏపీడీ మమ్మి, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి వి.విజయలక్ష్మి తదితరులతో కలిసి జిల్లా నులుములల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరించారు.
భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, గృహం, పింఛను, సదరం సర్టిఫికెట్, రోడ్లు మంజురు వంటి అంశాలపై మొత్తం - 198 అర్జీలు అందాయి. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రజల తమ సమస్యలపై తమ పరిధిలోని డివిజన్, మండల, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయ స్థాయిలలో కూడా సమర్పించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు.కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.