BREAKING
పంచాయతీ కార్యదర్శి బయ్యవరపు శివాజీకి రాష్ట్రస్థాయి సిల్వర్ మెడల్ ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం..

Select Suryaa Now
కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం..

  ముమ్మిడివరం మేజర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :కోనసీమ జిల్లా పోలీస్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన డాగ్ కెన్నెల్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ప్రారంభించారు.పోలీస్ శాఖలో నేర పరిశోధన, పేలుడు పదార్థాల గుర్తింపు, అనుమానాస్పద వస్తువుల తనిఖీల్లో కీలకంగా పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్‌కు మాయ నార్కోటిక్ ట్రేకర్ నూతనంగా చేరడం తో మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ నూతన కెన్నెల్‌ను ఏర్పాటు చేశారు.
డాగ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న శునకాలకు వసతి, ఆహారం, ఆరోగ్య పరిరక్షణ, శిక్షణ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కెన్నెల్‌ను రూపొందించారు.అత్యవసర సమయాల్లో డాగ్ స్క్వాడ్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు, శునకాలకు నిరంతర శిక్షణ అందించేందుకు ఈ కెన్నెల్ ఉపయోగపడనుంది

ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, నేరాల ఛేదనలో శిక్షణ పొందిన శునకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.