పంచాయతీ కార్యదర్శి బయ్యవరపు శివాజీకి రాష్ట్రస్థాయి సిల్వర్ మెడల్
పంచాయతీ కార్యదర్శి బయ్యవరపు శివాజీకి రాష్ట్రస్థాయి సిల్వర్ మెడల్
విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ సత్తా.. 92 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-
ప్రభుత్వ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలందిస్తూనే క్రీడారంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు జగ్గయ్యపేట మండలం పంచాయతీ కార్యదర్శి భయ్యవరపు శివాజీ. రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించి మండలానికి, జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు.ఎన్ టీ ఆర్ జిల్లా తిరువూరులో అక్టోబర్ 3, 4 తేదీల్లో కీ.శే. నాగుబండి రామారావు మెమోరియల్ పేరిట 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పురుషుల, మహిళల క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించారు.ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో జగ్గయ్యపేట మండలం పంచాయతీ కార్యదర్శి బయ్యవరపు శివాజీ ఎం–2 విభాగంలో 92 కేజీల కేటగిరీలో పోటీపడి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. హోరాహోరీగా సాగిన పోటీలో ద్వితీయ స్థానాన్ని సాధించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు.
ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రమశిక్షణతో కూడిన క్రీడాభ్యాసాన్ని కొనసాగిస్తూ రాష్ట్రస్థాయిలో పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ క్రీడలపై ఆసక్తితో నిరంతరం సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ పోటీలకు ఎన్‌టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆతిథ్యం ఇచ్చింది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన బయ్యవరపు శివాజీని ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా ఆయనను సహచర ఉద్యోగులు, క్రీడాభిమానులు, పలువురు ప్రముఖులు సన్మానించి అభినందించారు.పతకం సాధించిన శివాజీ 92 కేజీలు కేటగిరీలో ఎం–2 విభాగం,బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్–2026,ద్వితీయ స్థానం దక్కించుకొని సిల్వర్ మెడల్ సాధించారు.