BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి

విజయవాడ కార్పొరేషన్,  మేజర్ న్యూస్ : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించిన ఆయన, జోనల్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఫిర్యాదుల పరిష్కార వేదికను కూడా పరిశీలించారు. ఫిర్యాదుదారులను కార్యాలయాలకు పదేపదే పిలిపించకుండా అధికారులు స్వయంగా సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని, కారణాలను పూర్తిగా తెలుసుకుని నిబంధనల మేరకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. పరిష్కరించే అవకాశం లేని ఫిర్యాదుల విషయంలో ఏ నిబంధన లేదా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం పరిష్కరించలేకపోతున్నారో ఫిర్యాదుదారులకు స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వేదికలో వివిధ శాఖలకు సంబంధించి 20 ఫిర్యాదులు అందగా, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు 2, ఇంజినీరింగ్ శాఖకు 8, ఎస్టేట్ విభాగానికి 3, రెవెన్యూ శాఖకు 2, యూసీడీ విభాగానికి 3, ప్రజారోగ్య శాఖకు 2 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె. శకుంతల, ప్రధాన నగర ప్రణాళికాధికారి సంజయ్ రత్నకుమార్, ప్రధాన వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ నిర్మల గ్లోరీ, ప్రధాన ఇంజినీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ సృజన తదితర అధికారులు పాల్గొన్నారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.