సూర్య తిమ్మాపూర్ :తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీని గ్రామపెద్దలు, భక్తులు, ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా కేతిరెడ్డి సింగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అడిచెర్ల సత్యనారాయణ, కోశాధికారిగా మడుపు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సమన్వయంతో కృషి చేయాలని నిర్ణయించారు. దేవాలయ నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొన్నాల సంపత్, ఎడ్ల నారాయణరెడ్డి, రాజిరెడ్డి, పోరండ్ల ఎల్లారెడ్డి, ఏండ్రా బాలరాజు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, కుంట రాజేందర్‌రెడ్డి, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, ఎడ్ల అంజిరెడ్డి, పొన్నాల తిరుపతితో పాటు గ్రామపెద్దలు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.