BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక

Select Suryaa Now
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక

రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి

బ్యాంకు గ్యారంటీలు, గోనె సంచులు, హమాలీలు, వాహనాలు సిద్ధం చేయాలి

మచిలీపట్నం,  మేజర్ న్యూస్ : ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణ ప్రక్రియను పటిష్ట ప్రణాళికతో, అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం బ్యాంకు మేనేజర్లు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ధాన్యం సేకరణకు అవసరమైన ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీలు, వాటి సమర్పణలో సమస్యలు, బ్యాంకు చార్జీలు తదితర అంశాలపై చర్చించారు. రైస్ మిల్లులు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నందున నిబంధనల మేరకు మిల్లర్ల వ్యవసాయ భూములను భద్రతగా పరిగణించి బ్యాంకు గ్యారంటీలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలని మిల్లర్లు కోరారు. అన్ని బ్యాంకుల్లో సహేతుకమైన చార్జీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీందర్ తెలిపారు. ప్రస్తుతం కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీ సదుపాయం అందుబాటులో లేనందున, సాఫ్ట్‌వేర్‌లో ఆ సదుపాయాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రారంభానికి ముందే అవసరమైన గోనె సంచులు, హమాలీలను సిద్ధం చేసుకోవాలని, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి తగిన సంఖ్యలో వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్ మిల్లుల వద్ద రైతుల ధాన్యం వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండకుండా రద్దీ, నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించడం, వారికి సకాలంలో సేవలు అందించడం లక్ష్యంగా పౌరసరఫరాలు, వ్యవసాయ, బ్యాంకులు, రైస్ మిల్లర్లు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామ ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ జి.వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, కృష్ణాజిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పిన్నమనేని వీరయ్య, మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.