telanagana
షెడ్డు నిర్మాణపు నిధుల మంజూరుకై వినతి
సూర్య ధర్మపురి: మండలంలోని తీగల ధర్మారంలో గల శ్రీ దుర్గా మాత ఆలయ కమ్యూనిటీ హాల్ రేకుల షెడ్డు నిర్మాణానికి మంజూరు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు. మంగళవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు వినతి పాత్రాన్ని అందజేశారు. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారంలో గల శ్రీ దుర్గా మాత ఆలయం అతి పురాతనమైనదని వివరిస్తూ ఆలయానికి కమ్యూనిటీ హాల్ మంజూరు ఇప్పించగలరని రాష్ట్ర మంత్రిని కోరారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిరి అశోక్, మాజీ సర్పంచులు జంగిలి ప్రభాకర్, పందిరి తిరుపతి, ఆలయ కమిటీ చైర్మన్ జంగిలి రవీందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.