ఇరిగేషన్ ఈఈ నాగేశ్వర్ రావు మృతి పాడే మోసిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ , మేజర్ న్యూస్: దామరచర్ల మండలంలోని కేతావత్ తండాకు చెందిన నీటిపారుదల శాఖ కార్య నిర్వాహక ఇంజనీర్ కేతావత్ నాగేశ్వర్ రావు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్నమిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ వారి స్వ గృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం నాగేశ్వర్ రావు అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాడె మోసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతినితెలియజేశారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనో ధైర్యంకల్పిస్తూకుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.