BREAKING
పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు

Select Suryaa Now
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

, పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య  మంత్రి  సత్యకుమార్ యాదవ్  వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు తాను, అమలాపురం ఎమ్మెల్యే  అయితబత్తుల ఆనందరావు  పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోగ్రామ ఆరోగ్య క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నరేంద్రపురంలో ఈ క్లినిక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్యం గ్రామంలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కో లోకేటెడ్ పీహెచ్‌సీ ఏర్పాటుకు సంబంధించి, తాత్కాలికంగా ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే నరేంద్రపురంలో పూర్తిస్థాయి పీహెచ్‌సీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.