ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ
-పి.గన్నవరం మేజర్ న్యూస్ :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల రోజుల కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు.ముందుగా పి.గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్థానిక త్రీ రోడ్ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజకీయ ఆరంగేట్రం చేసిన దగ్గర నుండి నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక వ్యక్తి మోదీ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్న ప్రధాని మోదీకి,ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
కో-కన్వీనర్ డీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఆయన సేవా మార్గాన్ని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు మద్దాల సుబ్బారావు, మండల టిడిపి అద్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, ఇండస్ట్రియల్ స్టేట్ డైరెక్టర్ మట్టపర్తి బాల భారతి, టిటిడి మాజీ సభ్యులు డొక్కా నాద్ బాబు, కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.