అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్
పెదవేగి, మేజర్ న్యూస్ :పిల్లలలో అయోడిన్ లోపం ఉండటం వల్ల ఎదుగుదల మందగించడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పెదవేగి ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కార్తీక్ తెలిపారు. బుధవారం పెదవేగి లోని మండల పరిషత్ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అయోడిన్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలలో అయోడిన్ శాతం తక్కువగా ఉండడానికి కారణాలను తెలుసుకోవడంతో పాటు, వారిలో అయోడిన్ తగ్గకుండా, పెరగకుండా సాధారణ స్థాయిలో ఉండే విధంగా తగు సూచనలను సలహాలను అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయనిర్మల, పీహెచ్ఎన్ నాగమణి, హెచ్ఎస్ రమేష్, ఏఎన్ఎం పద్మ, వేణు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరోకే బాల సౌరి ఏలూరు జిల్లా,