BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు

Select Suryaa Now
భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు

కీసర, మేజర్ న్యూస్  (అక్టోబర్ 6):

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి అరుదైన గౌరవం లభించింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూషనల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలకు ఈ కళాశాల ఎంపికైంది. 
ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ జ్ఞాన, విజ్ఞానాలు, గణిత–ఖగోళ శాస్త్రాల ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేసేందుకు కళాశాల విద్యార్థులు చీర్యాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

సంప్రదాయ కొలతలపై వెబ్‌‌సైట్ రూపకల్పన:

మొదటి కార్యక్రమంగా “ట్రెడిషనల్ మెజర్‌మెంట్ రికోడెడ్ – దేశీనాప్” పేరుతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. భారతీయ సంప్రదాయ కొలత పద్ధతులు, వాటి వెనుక ఉన్న విజ్ఞానాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి. నీరజ రాణి నాయకత్వంలో, కో-ఇన్వెస్టిగేటర్లు డాక్టర్ ఎన్. సుబద్ర, డాక్టర్ బి. నాగమణి, శ్రీమతి ఉషశ్రీ మార్గదర్శకత్వంలో ఇంటర్న్లు డి. శ్రీనిత్య రెడ్డి, కె. రేష్మన్, జి. సంజన, ప్రసన్నలు సంప్రదాయ కొలతల సమాచారాన్ని డిజిటల్ రూపంలోకి తెస్తూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.

వేద గణితం, ఖగోళ విజ్ఞానానికి మొబైల్ యాప్:

రెండవ కార్యక్రమంగా “అనుభవ–ప్రక్రియ–ప్రయోగ” పేరిట మరో అవగాహన సదస్సు నిర్వహించారు. వేద గణితం, భారతీయ ఖగోళ విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిచయం చేయడం దీని లక్ష్యం. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎన్. సుబద్ర నేతృత్వంలో ఇంటర్న్లు ఆరవ్ సింగ్, బీవీఎస్ పవన్ శ్రీకర్, ఎన్. అభినవ్‌లు వేద గణితం, ఖగోళ విశేషాలను సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను తయారు చేశారు.

భారతీయ విజ్ఞాన వారసత్వాన్ని అందివ్వడమే లక్ష్యం:
మన ప్రాచీన సాంకేతిక, సాంస్కృతిక వారసత్వ విలువలను యువతకు చేరువ చేయడం, ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన వెబ్‌సైట్, యాప్‌లను వారు అభినందించారు.ఈ కార్యక్రమ సాధనకు సహకరించిన చీర్యాల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రేఖకు, ఉపాధ్యాయులకు, గీతాంజలి కళాశాల యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

గణేష్, కీసర రిపోర్టర్, మేడ్చల్ జిల్లా.