విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు
విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో 2026 జిల్లాస్థాయి బెస్ట్ స్వచ్ఛత ఆంధ్ర ఎన్జీవో విభాగంలో విజయ మహిళా మండలి, ఎమ్మిగనూరుకు అవార్డు జాబితాలో చోటు లభించింది.
ఈ సందర్భంగా విజయ మహిళా మండలి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం. గంగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణలో నిరంతరం సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అభినందించారు.
ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో విజయ మహిళా మండలి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విజయ మహిళా మండలి అధ్యక్షురాలు కె.ఏ.ఎల్. సువర్ణమ్మ, కార్యదర్శి ఎస్. కమల సుజాత, సీఈఓ డాక్టర్ బి. ఓంకారమాచారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలాచారి, సిబ్బంది పాల్గొన్నారు.