telanagana
కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి
సుార్య, జన్నారం;కవ్వాల్ అడవుల్లో మంగళవారం ఐటిఐ, ఏటీసీ విద్యార్థులు సందడి చేశారు. వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జన్నారం అటవీ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం రేంజ్ లోగల గోండుగూడా, పైడిపల్లి బీట్లలో విద్యార్థులు గొండుగూడ గేటు నెంబర్ వన్ నుండి పైడిపల్లి బైసన్ కుంట వరకు ప్రకృతి నడక చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ రామ్మోహన్ మాట్లాడుతూ వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాముఖ్యతపై అలాగే జీవవైవిద్యం, వన్య ప్రాణుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, వాటి సహజ ఆవాసాల పరిరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం రేంజ్ ఆఫీసర్ బాబా ఖాదర్ వలీ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, సెక్షన్ ఆఫీసర్ లు శివ కుమార్, శంకర్, బీట్ ఆఫీసర్లు సంతోష్, రవి నాయక్, లక్ష్మణ్, మంగ, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.