BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

పెనుగంచిప్రోలులో టీడీపీ మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ప్రెస్ మీట్* *కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో విశ్వాసం - రానున్న ఎన్నికల్లో అఖండ విజయం మాదే*

Select Suryaa Now
పెనుగంచిప్రోలులో టీడీపీ మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ప్రెస్ మీట్*  *కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో విశ్వాసం - రానున్న ఎన్నికల్లో అఖండ విజయం మాదే*

*పెనుగంచిప్రోలులో టీడీపీ మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ప్రెస్ మీట్*

*కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో విశ్వాసం - రానున్న ఎన్నికల్లో అఖండ విజయం మాదే*

*పెనుగంచిప్రోలు, అక్టోబర్ 7 (మేజర్ న్యూస్):*

పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు  చింతల వెంకట సీతారామయ్య  విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20,000, దీపం 2.0 కింద 3 ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, పింఛన్ల పెంపు లాంటి పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోంది" అని వివరించారు.గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు."ఈ పథకాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. పెనుగంచిప్రోలు మండలంలోని ప్రతి గ్రామంలో కూటమి కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధిస్తుంది. అదే దిశగా మా గెలుపును కొనసాగిస్తాం" అని చింతల వెంకట సీతారామయ్య  ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రెస్ మీట్ లో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ప్రశాంత్ పెనుగంచిప్రోలు