BREAKING
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.

ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

Select Suryaa Now
ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

చింతలపూడి మేజర్ న్యూస్: మండలం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జనసైనికుడికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.ప్రగడవరం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జనసైనికుడు డోలా నాగరాజు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.విషయం తెలుసుకున్న చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు చీదరాల దుర్గాపార్వతి మధుబాబు గత ఆగస్టు 9న నాగరాజును పరామర్శించారు. ఆ సమయంలో ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం తాజాగా నాగరాజుకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో జనసైనికులకు అండగా నిలవడం జనసేన కుటుంబం బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ కోసన చంద్రబాబు, టీడీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జగన్నాథం కుమార్, కురిసెట్టి శీను, వెన్న సత్యనారాయణ, ఆకుల మధుతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఖలీల్ చింతలపూడి ఏలూరు జిల్లా,