BREAKING
పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు!

Select Suryaa Now
 శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు!

సూర్య అమరావతి బ్యూరో: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. అక్టోబర్ నెలలో శ్రీశైల క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల విశిష్టతను, ఈ ఉత్సవాల్లో అమ్మవారు దర్శనమిచ్చే వివిధ అలంకారాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో దేవస్థానం చేపడుతున్న విస్తృత ఏర్పాట్లు, భక్తుల వసతి, క్యూలైన్లు మరియు అన్నదాన ఏర్పాట్లపై వారు చర్చించారు.

శ్రీశైల క్షేత్ర పవిత్రతను కాపాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అనంతరం శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనే అంశంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.