BREAKING
పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ

Select Suryaa Now
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ

విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొన్న బస్సు.. 

డ్రైవర్, ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు

సూర్య, కోరుట్ల: కోరుట్ల పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి ప్రత్యేక తరగతులు ముగించుకున్న విద్యార్థులు టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలం వైపు బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో మరో వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యార్థులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్‌ను బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ కమలాకర్‌తో పాటు విద్యార్థినులు హర్షిత, మోక్షిత తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వాహనాల ద్వారా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.