BREAKING
రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్

కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి

Select Suryaa Now
కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి

 

392 ఓట్ల భారీ మెజారిటీతో ఆశా సుబ్రహ్మణ్యం ఘన విజయం

ప్రజల నమ్మకమే నా గెలుపునకు పునాది.. గ్రామ అభివృద్ధే నా లక్ష్యం

గుడిపల్లి మేజర్ న్యూస్ : గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి మద్దతుతో పోటీ చేసిన ఆశా సుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 392 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో కుప్పిగానిపల్లి గ్రామంలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆశా సుబ్రహ్మణ్యంకు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ఆశా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించిన కుప్పిగానిపల్లి పంచాయతీ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, తనకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తది, ప్రతి గ్రామస్తుడిదని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని, గ్రామంలో తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, తనకు ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారిని కూడా సమానంగా గౌరవిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కుప్పిగానిపల్లి పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తానని ఆశా సుబ్రహ్మణ్యం తెలిపారు.

సూర్య రిపోర్టర్: లెనిన్ గుడిపల్లి మండలం