BREAKING
జెడ్డా సహా సౌదీ ఓడరేవులపై హూతీల తీవ్ర హెచ్చరిక: విమానాశ్రయాల ఆధునికీకరణకు ప్రైవేట్ నిధులు జపాన్ స్టార్‌బక్స్ వ్యాపారాన్ని విక్రయించేందుకు సన్నాహాలు: హాంగ్‌కాంగ్ అగ్నిప్రమాదానికి ఏడాది.. బాధితుల శోకం, జవాబుదారీతనంపై నిలదీతలు అమెరికా సమాచార కేంద్రాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుదల: జోకులతోనే బదులిస్తున్న తైవాన్ హాస్యనటుడు హువాంగ్ యి-హావో భారత స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభం: ఉత్తర కొరియా సంచలన నిర్ణయం.. ప్యాంగ్‌యాంగ్ నుంచి స్విస్ దౌత్య ప్రతినిధి బహిష్కరణ బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కార్మికుల కనీస వేతనం 36 శాతం పెంపు బాదం పాలు, గోల్ఫ్‌తో పోలిస్తే ఏఐ నీటి వినియోగం చాలా తక్కువే యూపీ ఎన్నికల సమరానికి ఎస్పీ శంఖారావం.. తొలి జాబితా విడుదల, కాంగ్రెస్‌కు ఝలక్! బెజ్జుర్ కార్యదర్శి లేక జీపీ అభివృద్ధి పనులకు ఆటంకం అయోవా పేలుడు పదార్థాల ధ్వంసం జపాన్ వ్యాపార విక్రయానికి స్టార్‌బక్స్ కసరత్తు అమెరికాలో డేటా సెంటర్ల జోరు

కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం

Select Suryaa Now
కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం
  • ఐసిడిఎస్ పి ఓ గొట్టాపు సుగుణకుమారి,రౌతు లక్ష్మీ

గరుగుబిల్లి: గర్భిణులు, బాలింతలు మరి యు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పోషణ్ మా" (జాతీయ పోషణ మాసం) కార్యక్ర మంతో పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కొత్తపల్లి, రావుపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్ లు పొగిరి లక్ష్మీ, చంద్రుడు,చింతల అరుణ కుమారి తోపాటు ఆయాలకు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు పలువురు లబ్ధిదారులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా అంగన్వాడీ వర్కర్ లు పొగిరి లక్ష్మి, చంద్రుడు,చింతల అరుణకుమారి,ఆయాలకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.అదే విధముగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్ర మంలో భాగంగా కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణ కుమారి,గరుగుబిల్లి సెక్టార్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రౌతు లక్ష్మీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి మాట్లాడుతూ పోషకాహారలోపాన్ని నిర్మూలించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు.నెల రోజుల ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించేం దుకు వారు చేసిన కృషి అభినందనీ యమన్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపు పోషణ్ మా ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరి చిన అంగన్‌ వాడీ కార్యకర్తలను అధికారు లు మరియు ప్రజాప్రతినిధులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించ డం జరుగుతుందన్నారు.పోషణ్ మాసోత్సవాలలో అంగన్‌వాడీ కార్య కర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన 9వ రాష్ట్రీయ పోషణ్ మాస్ (జాతీయ పోష కాహార మాసం - 2026) ఉత్సవాల్లో భాగంగా, క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తరఫున సన్మా నించడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని 'సుపోషిత్ భారత్' (పోషకా హార లోపం లేని భారతదేశం)గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పోషణ్ అభియాన్ కొన సాగుతోందని పేర్కొ న్నారు.గరుగుబిల్లి సెక్టార్ సూపర్వైజర్ రౌతు లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలే నిజమైన క్షేత్రస్థాయి యోధులని పేర్కొన్నారు.సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని, అందుకే కేంద్ర ప్రభుత్వం 'సేవా సంకల్ప్ అభియాన్' ద్వారా తగిన గుర్తింపు ఇస్తోందని తెలి పారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ లు పొగిరి లక్ష్మీ,చంద్రుడు, చింతల అరుణకుమారితోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.