BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం

Select Suryaa Now
పీఎంశ్రీ పాఠశాలల్లో..  ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం
  • జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు

రంగారెడ్డి జిల్లాలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, సహాయ సేవలు అందించేందుకు ప్రత్యేక అతిథి విద్యాబోధకులను నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 36 పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలకు ఒకరి చొప్పున మొత్తం 36 మంది ప్రత్యేక అతిథి విద్యాబోధకులను నియమించనున్నట్లు తెలిపారు. వీరు నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలల పాటు సేవలందిస్తారని, నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

పీఎం శ్రీ పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో పాటు సంబంధిత క్లస్టర్, మండల, కాంప్లెక్స్ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు కూడా ఈ ప్రత్యేక అతిథి విద్యాబోధకులు అవసరమైన విద్యా సహాయాన్ని అందిస్తారని డీఈఓ తెలిపారు.

జిల్లాలో ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో ఉన్న భవిత కేంద్రాల ద్వారా IERPలు, అలాగే 53 మంది ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధన, సహాయ సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరికి అదనపు సహకారంగా మరో 36 మంది ప్రత్యేక అతిథి విద్యాబోధకులు అందుబాటులోకి రానున్నారని పేర్కొన్నారు.

స్పెషల్ బీఈడీ, లేదా జనరల్ బీఈడీతో పాటు స్పెషలైజేషన్ డిప్లొమా/పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులకు అర్హతల మేరకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలు, పరిసర ప్రాంతాలకు చెందిన అర్హత గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, సంబంధిత సర్టిఫికెట్లతో ఈ నెల 10వ తేదీలోగా తమ పరిధిలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు సమర్పించాలని డీఈఓ ఎస్. వెంకటేశ్వర్లు కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు అందిన దరఖాస్తులను, ధ్రువపత్రాలను పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా విద్యాశాఖకు సమర్పిస్తారని తెలిపారు.

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)