కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు
కనిగిరి, మేజర్ న్యూస్ :
మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు అవసరమైన 100 బ్యాలెట్ బాక్సులు అందాయని,అందిన బ్యాలెట్ బాక్సులను సంబంధిత నిబంధనల ప్రకారం భద్రపరచినట్లు మున్సిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో అవసరమైన విధంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టడం జరిగినదని తెలిపారు.కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా,నిష్పక్షపాతంగా మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కమీషనర్ తెలిపారు.