మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు
- హాజరైన ఐఈఈఈ,ఎప్సికో కంపెనీల ప్రతినిధులు
మదనపల్లె : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు సెంట్రల్ లైబ్రరీ విభాగం వారు ఐఈఈఈ,ఎప్సికో వారి ఆద్వర్యంలో ఈ జర్నల్స్ పై మంగళవారం అవగహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ పెరియసామి ప్రదీప్,ట్రైనింగ్ మేనేజర్,ఐఈఈఈ,ఎప్సికో,ఎస్.ఆర్.మంజునాథ్, రీజినల్ సేల్స్ మేనేజర్ చెన్నై పాల్గొన్నారు.ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,లైబ్రరీ ఇంచార్జి డాక్టర్ సురేష్ బాబు మరియు అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.పెరియసామి ప్రదీప్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి మరియు అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు.అందుకు కావాల్సిన పరిశోధనలకు సంబంధించిన జర్నల్స్ లైబ్రరీలో ఐఈఈఈ,ఎప్సికో ద్వారా పొందవచ్చునన్నారు.పరిశోధన విధానాలను మరియు పద్దతులను వాడే విధాన్నాన్ని వివరించారు.పరిశోధనలకు సంబంధించి జర్నల్స్ ఆన్లైన్ శోధన పద్దతులను విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరించారు.ఆన్లైన్ లో పరిశోధనలకు కావలసిన సమాచారం చాలా ఉందని,అందులో మనం విలువైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు.అనంతరం ఎస్.ఆర్ మంజునాథ్ మాట్లాడుతూ మారుతున్న పరిశోధనా రంగంలో ఓపెన్ సైన్స్ విధానాల ప్రాధాన్యతను వివరించారు.పరిశోధనా ఫలితాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం,పరిశోధనకు గుర్తింపు,ప్రాచుర్యం,ప్రభావాన్ని పెంచడం వంటి అంశాలపై వివరించారు.విశ్వసనీయమైన పరిశోధనా వనరులను గుర్తించడం,అధికారిక సమాచార వేదికలను వినియోగించడం,పరిశోధనకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం,సాహిత్య సమీక్షలను మెరుగుపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.పరిశోధనా వ్యాసాలు,విద్యా ప్రాజెక్టులు,ప్రచురణల నాణ్యతను పెంచడంలో ఐఈఈఈ వనరులు ఉపయోగపడతాయని తెలిపారు.పరిశోధన సామర్థ్యాలను పెంపొందించుకోవడం,నాణ్యమైన పరిశోధనా సమాచారాన్ని గుర్తించడం,అందుబాటులో ఉన్న విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధ్యాపకులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.గంగిశెట్టి విద్యార్థులు,కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు,పీజీ విద్యార్థులు,పీహెచ్‌డీ పరిశోధకులు,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.