వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే
మదనపల్లె : మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు మంగళవారం వెలుగు ప్రత్యేక పాఠశాల,వెలుగు గరుండ స్కీం (గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్) నందు ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ డేన నిర్వహించారు.వెలుగు ప్రత్యేక పాఠశాల,వెలుగు గరుండ స్కీం నందు ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెలుగు సోషల్ వర్కర్ యం.గీత,ప్రిన్సిపాల్ పి లీనా కుమారి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.అనంతరం ప్రిన్సిపాల్ లీనా కుమారి మాట్లాడుతూ వరల్డ్ సెరెబ్రల్ పాల్సీ డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 6న నిర్వహిస్తున్నామనీ,ఈ సంవత్సరం 2026 సందేశం ప్రత్యేకం మరియు ఐక్యత (యునిక్యూ అండ్ యునైటెడ్) అనే నినాదాన్ని నిర్ణయించారు.మస్తిష్క పక్షవాతం (సెరిబ్రల్ పాల్సీ) ఉన్న వ్యక్తుల విభిన్న అనుభవాలను గౌరవిస్తూనే,మరింత కలుపుగోలు సమాజం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.స్పెషల్ ఎడ్యుకేటర్ జె.ఎన్.విజయ కుమారి మాట్లాడుతూ సెరిబ్రల్ పాల్సీ అంటే మెదడు పక్షవాతం అనీ,ఇది ఒక రుగ్మత అనీ,దీనిని నయం చేయడానికి ఎటువంటి మందులు లేవనీ తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు ఫిజియో థెరపీ,ఆక్యుపేషనల్ థెరపీ,ఆపరేషన్స్,సహాయ పరికరాలు ఉపయోగించడం ద్వారా వీరిలో రుగ్మత తీవ్రతను తగ్గించగలమేగానీ నయం చేయలేమన్నారు.ఈ సెరిబ్రల్ పాల్సీలోని రకాలు వైవిధ్యాలు గురించి తెలియజేస్తూ సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లల్ని ఒక సమూహంగా చేర్చి సమాజంలో కలిపి వారికీ అన్ని సహాకారాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ రోజును జరుపుకుంటున్నామనీ తెలిపారు.అనంతరం వార్డెన్ స్వీటీ మాట్లాడుతూ సెరిబ్రల్ పాల్సీ మూడు రకాలని,అవి స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ,అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ,డైస్కినెటిక్ సెరిబ్రల్ పాల్సీ ఉంటాయన్నారు.వీరికి ఫిజియో థెరపీ చేయడం వలన కండరాలలో కదలికలు తీసుకోని రావడం వలన వారి జీవితాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.లీనాకుమారి,సోషల్ వర్కర్ యం.గీత,స్పెషల్ ఎడ్యుకేటర్స్ యస్.రాధమ్మ జె.ఎన్ విజయ కుమారి వార్డెన్ స్వీటీ,వెలుగు సిబ్బంది,చిన్నారులు పాల్గొన్నారు.