BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు

Select Suryaa Now
యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు
  • భర్త ఫిర్యాదుతో కేసు నమోదు

చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌కేపల్లి గ్రామంలో 22 ఏళ్ల వివాహిత మహిళ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్‌కేపల్లి గ్రామానికి చెందిన కొలగళ్ల సుధాకర్ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న ఉదయం పనికి వెళ్లిన సుధాకర్ రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య శిరీష ఇంట్లో కనిపించలేదు.

ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఈ నెల 6న ఎర్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ దయాకర్ సుధాకర్‌కు ఫోన్ చేసి, శిరీష తనకు ఫోన్ చేసి ఇకపై భర్తతో వైవాహిక జీవితం కొనసాగించనని తెలిపినట్లు సమాచారం ఇచ్చాడు.

తన భార్య అదృశ్యానికి ఎర్లపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త కుమారుడు గణేష్‌పై అనుమానం ఉందని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చేవెళ్ల పోలీసులు Cr.No.685/2026 U/h Woman Missing కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అదృశ్యమైన శిరీష వయస్సు 22 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5.2 అడుగులు, గోధుమ వర్ణం, తెలుగు మాట్లాడగలదు. అదృశ్యమైన సమయంలో ఆరెంజ్ రంగు చీర ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

( చేవెళ్ల - మేజర్ న్యూస్)