BREAKING
ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక ఈసీ వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: అదుపులోకి తీసుకున్న ఎంపీల విడుదల

కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి

Select Suryaa Now
కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి

నారాయణపేట, సూర్యన్యూస్ :
ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన నరసమ్మ (58) కి భర్త దస్తప్ప 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, తనకు ఉన్న 5 ఎకరాల పొలంలో వరి పంట వేశారు. ఆమెకు ఇద్దరూ కుమారులు కాగా దస్తప్ప, మల్లేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పరిధిలో గొర్రెలు మోయడానికి వెళ్తుంటారు. అయితే కుమారులు స్థానికంగా ఉండకపోవడంతో పంటకు నీళ్లు పెట్టడానికి నరసమ్మ వెళ్తుంటుంది. ఆ క్రమంలో మంగళవారం సైతం పొలానికి వెళ్లగా మోటారు సమీపంలో బోర్ స్టాటర్ దగ్గర ఏపుగా పెరిగి ఉన్న గడ్డిని కోస్తున్న సందర్భంలో తెగిపడిన సర్వీస్ వైర్ తాకి విద్యుత్ షాక్ కు గురైంది. అక్కడ మేకలు మేపుతున్న తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాములు నీళ్లు తాగడానికి బోరు దగ్గరకు వేళ్లి చూడగా ఆమె కరెంటు షాక్ గురై చనిపోయిన విషయాన్ని గమనించి మృతురాలు కుమారుడికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే మహిళా రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు  చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.