BREAKING
దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల!

ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

Select Suryaa Now
ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ప్రజలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మంగళవారం నగరంలోని వేముల శ్యామలాదేవి రోడ్, భగత్‌సింగ్ రోడ్, సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్, సుందరయ్యనగర్ కట్ట ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ, మౌలిక వసతులను పరిశీలించారు. సత్యనారాయణపురంలోని భగత్‌సింగ్ రోడ్ వద్ద వీఆర్ ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను తనిఖీ చేసిన ఆయన, ప్రతి డివిజన్‌లోని నీటి ప్లాంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు నిర్దేశిత సమయాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సుందరయ్యనగర్ కట్ట ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని యజమానులతో తొలగించేలా చూడాలని సూచించారు. వర్షాలు కురిసిన వెంటనే దోమల నియంత్రణ చర్యలు చేపట్టి వాటి అభివృద్ధికి అవకాశం లేకుండా చూడాలన్నారు. అనంతరం అజిత్‌సింగ్‌నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి ఆహారం, తాగునీరు, వాడుక నీరు, పారిశుధ్య నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యటనలో జోనల్ కమిషనర్ కే. ప్రభుదాస్, కార్యనిర్వహణ ఇంజినీర్ గోపాలకృష్ణమూర్తి, సహాయ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.