పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష
జీలుగుమిల్లి మేజర్ర్ న్యూస్ : పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల తహసీల్దార్లతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల్లో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, భూ సంబంధిత అంశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న అర్జీలు తదితర అంశాలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు.మండలాల వారీగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
రిపోర్టర్ :-బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా