శ్రీ కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణము అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రాలను మంగళవారము మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ నెల 12 నుండి 16 వరకు శ్రీ కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ అధ్యక్షుడు ముప్పిడి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం అంజయ్య, గుణంగారి దినేష్ రెడ్డి, పోతగల దానయ్య, కొమ్ము లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మెరుగు బాలకృష్ణ యాదవ్ , కేసారం బాల్ రెడ్డి ,నల్ల నాగేశ్వర్ ,ప్రధాన కార్యదర్శి దొడ్డమోని దినేష్ యాదవ్ ,సహాయ కార్యదర్శిలు సంకు నరసింహ, గోర్కంటి బాలయ్య, దొడ్డమోని ప్రభాకర్ యాదవ్ ,కోశాధికారి మోటే మహేష్ కురుమ ,సహాయ కోశాధికారి వంగూరి సైదులు, కొమ్ము చంద్రయ్య, సంస్కృతిక కార్యదర్శి సొల్లు శంకర్ ,సహాయ సంస్కృతిక కార్యదర్శి సైదగాని సత్యనారాయణ, గౌరవ సలహాదారులు బొక్క బాల్ రెడ్డి, కొయ్యడ నరసింహ, గుణిగంటి మల్లేష్ ,చేరాల నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు.