BREAKING
నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర

విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు

Select Suryaa Now
విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు

ఏలూరు, మేజర్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని   జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.  శ్యామలరావుకు తెలియజేసారు.   పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యా, స్కిల్ డెవలప్మెంట్, తదితర అంశాలపై మంగళవారం  రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.  శ్యామలరావు జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి జె.  శ్యామలరావు మాట్లాడుతూ  విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సెస్సీ పరీక్షలలో మెరుగైన  ఫలితాల సాధనకు   మిషన్-మార్చ్- 27  కార్యక్రమంద్వారా 10వ తరగతి విద్యార్థులకు  ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించాలని, ఏ విద్యార్థి, ఏ సబ్జెక్టు లో వెనుకబడి ఉన్నాడో తెలుసుకుని, ఆ సబ్జెక్టు బోధనపై ఉపాధ్యాయులు  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు.  విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.  బడి ఈడు పిల్లలందరూ బడి బయట లేకుండా బడిలోనే ఉండాలన్నారు.   ప్రభుత్వ పాఠశాలల్లో 'మన బడి- మన భవిష్యత్తు' కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మంజూరైన మౌలిక సదుపాయాలు వేంటనే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ   ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు  నిర్ణీత సమయానికే పాఠశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల బోధన మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.    రాష్ట్ర ప్రభుత్వం   విద్యార్థుల తల్లితండ్రుల నుండి అభిప్రాయాలను కోరుతున్న  ఐవిఆర్ఎస్ సర్వే పై తల్లితండ్రులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. 

 న్యూస్ బ్యూరోకే బాలసౌరి, ఏలూరు జిల్లా 

 

 న్యూస్ బ్యూరో కె బాల సౌరి  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా