BREAKING
వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం గుర్తుతెలియని ఒక శవం

ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా , కలెక్టరేట్ ముట్టడి

Select Suryaa Now
ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా , కలెక్టరేట్ ముట్టడి

నారాయణపేట, సూర్యన్యూస్: 
అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఇండియా కూటమి ముందుకు పోతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేటలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలన్నారు. ఫారం-6 ప్రక్రియలోని లోపాలను తక్షణమే సరిదిద్దాలనీ, తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలనీ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలనీ, ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కార్యాలయ అధికారి(ఏఓ)కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి, సదాశివరెడ్డి, సలీం, బండి వేణుగోపాల్, బి.రాము, జయలక్ష్మి, సలీం, ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.