BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు

Select Suryaa Now
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు

అసలు వారసులం మేమే.. న్యాయం జరిగే వరకు పోరాటం
మాజీ సర్పంచ్ సుందరి అనిల్‌పై భూమి వారసుల సంచలన ఆరోపణలు

వికారాబాద్, మేజర్ న్యూస్: కోట్‌పల్లి మండలం బార్వాద్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 251లో ఉన్న 5 ఎకరాల 10 గుంటల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమిని కొందరు నకిలీ, ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయించారని భూమి వారసులు ఆరోపించారు. ఈ భూమికి తామే అసలైన వారసులమని స్పష్టం చేశారు.మంగళవారం వికారాబాద్‌ గెస్ట్‌హౌస్‌లో గ్రామస్తులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి భూమి వారసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ భూమికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేసి విక్రయించినట్లు ఆరోపించారు. అమ్జద్‌, ఫైజు, మాజీ సర్పంచ్‌ సుందరి అనిల్‌ కలిసి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఇతరులకు విక్రయించినట్లు వారు ఆరోపించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని పేర్కొన్నారు.తమ పూర్వీకుల భూమిని కాపాడుకునేందుకు అవసరమైన ఆధారాలతో చట్టపరమైన పోరాటం చేస్తున్నామని వారసులు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను కోరారు.

ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: అయ్యూబ్‌ అన్సారి

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకుడు అయ్యూబ్‌ అన్సారి మాట్లాడుతూ.. తాను సంబంధిత రైతులను ఇంతకుముందు కలవలేదని తెలిపారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే ఆరోపణలు చేయాలని సూచించారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ విషయంలోనూ వివాదం

కరీంపూర్‌ గ్రామానికి చెందిన ఆశయ్య మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌ సుందరి అనిల్‌ దళితుల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. తాను క్రిస్టియన్‌ అయినప్పటికీ దళితుడనే అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.కరీంపూర్‌ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానాలు చేసినట్లు ఆశయ్య తెలిపారు. అయితే అనంతరం ఆ స్థలాన్ని చర్చిగా మార్చడంతో కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు. దళితులపై నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను చర్చిగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎంబీ రికార్డుల్లోనూ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన నమోదు ఉన్నట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కరీంపూర్‌ గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.