BREAKING
వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం గుర్తుతెలియని ఒక శవం

ఎన్నికల ప్రచారంలో టి డబ్ల్యూయు, ఎస్డబ్ల్యూఏఫ్ నాయకులు

Select Suryaa Now
ఎన్నికల ప్రచారంలో టి డబ్ల్యూయు, ఎస్డబ్ల్యూఏఫ్ నాయకులు

నారాయణపేట, సూర్యన్యూస్ : 
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలలో టిడబ్ల్యూయు, ఎస్డబ్ల్యూఎఫ్ కలిసి పోరాటం చేస్తున్నాయని, బాణం గుర్తు కు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయా సంఘాల రీజియన్ నాయకులు వెంకటయ్య, కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణపేట డిపోలో ప్రచారం నిర్వహించారు. కార్మికులను కలుసుకుని ఓటు అభ్యర్థించారు. అనంతరం డిపో ముందు గెట్ మీటింగ్ తో పాటు టెంట్ దగ్గర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేట్ల పరం కాకుండా ప్రభుత్వములో విలీనము అవ్వాలంటే టిడబ్ల్యూఎస్, డబ్ల్యూఎఫ్ కూటమికి అమూల్యమైన ఓటు అందివ్వాలని కోరారు.ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడి నుండి బయటపడాలన్న ఆర్టీసీ సంస్థ సమస్యల నుంచి బయట పడాలన్న బాణం గుర్తుకే మన అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో రీజియన్  మరియు రాష్ట్ర గుర్తింపు ఎన్నికల్లో బాణం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయాలని కార్మికులను అభ్యర్థించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, నాయకులు విజయ్ బాబు, అహ్మద్ ఖాన్, నాగేందర్, మధుసూదన్, రాజు, హనుమంతు, సురేష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.