BREAKING
దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల!

దసరాకు రాష్ట్రపతి రాక

Select Suryaa Now
దసరాకు రాష్ట్రపతి రాక

దసరా ఉత్సవాలకు దేశ ప్రథమ పౌరురాలు రావడం గర్వకారణం 

25 లక్షల మంది భక్తుల రాకకు దసరా ఏర్పాట్లు 

ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం, సరస్ మేళా వంటి అనేక కార్యక్రమాలు 

వైభవోపేతంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం 

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 14న దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనుండటం విజయవాడకు గర్వకారణమన్నారు. 15న రాష్ట్రపతి సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. రోజుకు సగటున 2.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మూడు హోల్డింగ్ ప్రాంతాల్లో సుమారు 30 వేల మంది వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అక్కడ ప్రసాదం, ఆహారం, మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సామాన్య భక్తులే కేంద్ర బిందువుగా ఏర్పాట్లు ఉండాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా రద్దీకి అనుగుణంగా క్యూలను క్రమబద్ధీకరించాలని, వైద్య సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలీసు, దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆర్టీసీ, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గత ఏడాది సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నందున ప్రోటోకాల్ ఏర్పాట్లతో పాటు సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరాతో పాటు విజయవాడ ఉత్సవం, సరస్ మేళా వంటి కార్యక్రమాలు జరుగుతున్నందున భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గతం కంటే మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. భక్తుల భద్రత కోసం 500 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. దసరా ఏర్పాట్లలో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత, రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.