BREAKING
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం

సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

Select Suryaa Now
సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

అమలాపురం  మేజర్ న్యూస్ :జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేసి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, పోషకాహార, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, చిన్నారుల పోషకాహార పరిస్థితి, బాల్య వివాహాల నియంత్రణ, పోక్సో కేసులు, గృహహింస నిరోధక  చర్యలు, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ స్పందన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు :గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, పోషకాహార కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
బాల్య వివాహాల నివారణకు సమన్వయంతో చర్యలు :జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన నష్టాలపై తల్లిదండ్రులు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
బాల్య వివాహానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, చట్టపరమైన నిబంధనల మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాల నివారణలో గ్రామ, మండల స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పోక్సో కేసులపై అప్రమత్తంగా ఉండాలి :చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధిత చిన్నారులకు అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్, పునరావాసం వంటి సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన సహాయాన్ని అందించాలని తెలిపారు.
గృహహింస బాధితులకు అండగా నిలవాలి :గృహహింసకు గురవుతున్న మహిళలకు అవసరమైన రక్షణ, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేసే విధంగా అవగాహన కల్పించాలని, అందిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి :మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు కేవలం కార్యాలయ స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలో కూడా సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా శాఖ పనితీరును మరింతమెరుగుపరచాలని, ప్రతి కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం అందేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం, రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి, శాఖ పనితీరులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రతి నియోజకవర్గంలోని మండల స్థాయిలో లేదా సెక్టర్ స్థాయిలో పనితీరు ఎలా ఉంది అని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాల మహిళ శిశు సంక్షేమ శాఖ పురోగతిపై మందహాసంగా ఉందని, ప్రస్తుతం శాఖపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి డేటాను సమర్పించాలని తెలియజేశారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కే నాగమణి, మమ్మిడివరం,పి గన్నవరం, అమలాపురం, రామచంద్రపురం సిడిపివోలు ఎం. నిహారిక,వై.విజయశ్రీ వై కే డి రమాదేవి, వివి.వరమహాలక్ష్మి, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారిని కె.విశ్రాంతి కుమారి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు,గ్రేడ్ వన్ సూపర్వైజర్ లు జి. నాగ సత్య వేణి,కే.హైమావతి  అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు