BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్

Select Suryaa Now
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్

రూ.7,600 నగదు స్వాధీనం.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఒంగోలు, మేజర్ న్యూస్ : 

 అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఒంగోలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మద్దిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై మంగళవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామ శివారు పొలాల్లో మధ్యాహ్నం సమయంలో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చెంచయ్య, ఏఎ్‌సఐ షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.7,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. జూద క్రీడలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్‌ 112కు లేదా టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి సీఐ 9121102113, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.