By సూర్య ప్రతినిధి
Updated : 06 Oct 2026 21:43 IST
Select Suryaa Now
విశాఖపట్నం: జీవిఎంసీ 36వ వార్డు చిలకపేట నివాసం ఉంటున్న వాజబలిజ కులానికి చెందిన ఆనారోగ్యంతో బాదపడుతున్న చేపల ఎర్రమ్మ అనే మహిళలకు వైఎస్సార్సీపీ దక్షణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ రూ.5 వేలు ఆర్ధిక సహాయం అందించారు.. వార్డులో గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్న మహిళ వివారాల తెలుసుకున్న వార్డు అధ్యక్షుడు ఎం. ముజిబ్ఖాన్ వెంటనే వాసుపల్లి గణేష్కుమార్ తెలియపరచడంతో వెంటనే చిలకపేట మహిళ ఇంటికి వెళ్లి ముందుగా పరామర్శించారు. అనంతరం అమె వైద్యం నిమిత్తం అగనంపూడి వద్ద ఉన్న హోమ్నీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మరింతగా వైద్యం అందేవిధంగా వాసుపల్లి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఎవరికీ ఏ కష్టం వచ్చినా 24*7 ఎటువంటి హెల్ప్ చేయడం కానీ రెడీగా ఉన్నానని తెలియజేశారు ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ముజేబ్ ఖాన్ , స్థానికులు కాసుబాబు, ఆదినారాయణ, ఆదిలక్ష్మీ,జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు, జిల్లా జనరల్ సెక్రెటరీ గనగల రామరాజు,చిలకపేట సౌత్ అంగన్వాడీ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి,36వ వార్డు యూత్ ప్రెసిడెంట్ ఆదినారాయణ,జిల్లా బూత్ సెక్రటరీ ధనరాజ్,స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కాసుబాబు,బీసీ సెల్ ప్రెసిడెంట్అప్పారావు,36వ వార్డు జనరల్ సెక్రటరీ సత్య, దక్షిణ నియోజకవర్గ కాళింగ వైశ్య అధ్యక్షులు – రమణ,36వ వార్డు జనరల్ సెక్రటరీ వెంకటి,36 వ వార్డు ఉపాధ్యక్షులు తిత్తికృష్ణ,36వ వార్డు మైనార్టీ ప్రెసిడెంట్ – కమల్, జిల్లా మైనార్టీ సెక్రటరీ ఇబ్రహీం,36వ వార్డు సీనియర్ నాయకురాలు దేవి,36వ వార్డు సచివాలయం అధ్యక్షులు రవి నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. పాల్గొన్నారు.